తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నారని.. గత కొన్నిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని బలపరుస్తూ చాలా సందర్భాల్లో వీరిద్దరి ఫోటోలు ఈమధ్య వైరల్ గా మారాయి. కాగా కీర్తితో పాటూ అనిరుధ్ కుటుంబాలకి సైతం ఈ సంగతి తెలుసని కోలీవుడ్ టాక్. ఇక ఈ ఏడాదిలోనే పెద్దల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు కూడా మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

హీరోయిన్ మెహరీన్‌ అతిత్వరలో పెళ్లిపీటలెక్కబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. హరియాణా ఎక్స్ సిఎం భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనువడు భవ్య్ బిష్ణోయ్‌తో ఆమె మ్యారేజ్ జరగనుంది. మార్చి 12న జైపూర్‌ సిటీలోని అలీలాకోటలో ఎంగేజ్మెంట్ ఉంటుందని తెలియజేసారు మెహరీన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *