పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడీగా ఆఫర్ అంటే ఎగిరి గంతేస్తారు హీరోయిన్స్. కెరీర్ లో ఒక్కసారైన ఆ ఆఫర్ రాకబోతుందా అని వెయిట్ చేస్తుంటారు. మరి ఇలా చేస్తే…చూస్తే ఆమె సాయి పల్లవి ఎందుకవుతారు? అందుకే పవన్ సరసన అవకాశం వచ్చినా మొదట కాస్త బెట్టు చేసారు. సినిమాలో తన క్యారెక్టర్ కి కాస్త పదునిచ్చి, భారీ రెమ్యూనిరేషన్ డిమాండ్ చేసి నిర్మాతలు నువ్వే కావాలి అని పట్టుబడితే చివరికి అంగీకరించారట.

పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో మలయాళీ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ జరుగుతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేతో పాటూ మాటలు అందిస్తున్న ఈ మూవీని సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్స్ గా సాయిపల్లవి, ఐశ్వర్య రాజేశ్ పేర్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కానీ నిర్మాతలు ఎప్పుడో అడిగినా సాయిపల్లవి రీసెంట్ గా ఓకే చేసారనే టాక్ నడుస్తోంది.

అనేక పరిణామాల తర్వాత ఈ మూవీలో తన క్యారెక్టరైజేషన్ ను కాస్త మార్చి… 2 కోట్ల పారితోషికాన్ని సాయిపల్లవికి డిమాండ్ చేసారట మేకర్స్. దీంతో మంచి ఆఫర్ ప్లస్ భారీ మొత్తం ముట్టజెప్తుండటంతో సాయి పల్లవి సంతకం చేయక తప్పలేదట. ఇక ఈ యాక్షన్ డ్రామాలో రానా ఓ కీ రోల్ ప్లే చేస్తుండగా..రానాకు జంటగా ఐశ్వర్య రాజేష్ కనిపించనున్నారు. రానా నాన్నగా సముద్రఖని నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *