సినిమాలకు పెద్ద సీజన్ సంక్రాంతికి సినిమాల్ని లాక్ చేసుకుంటున్నారు స్టార్లు . నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ డేట్స్ ఇప్పుడే బుక్ చేసుకుంటున్నారు. వచ్చే సంక్రాంతి టాలీవుడ్ హిస్టరీలోనే ఎప్పుడూ రానంతమంది స్టార్ హీరోలతో ముస్తాబవుతోంది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కూడా పండక్కి వస్తున్నా అంటూ అనౌన్స్ చేశారు . 2018 లో రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత బాగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సమ్మర్ లో వకీల్ సాబ్ రిలీజ్ చేస్తున్నారు. కానీ 200కోట్ల రూపాయలతో క్రిష్ తో చేస్తున్న భారీ సినిమాని మాత్రం సంక్రాంతికే సిద్దం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

2022 సంక్రాంతి పోటీకి ఫస్ట్ ఖర్చీఫ్ వేసుకున్న హీరో బన్నీ. కొరటాల శివ డైరెక్షన్లో బన్నీ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ని ఎర్లీ జనవరిలోనే రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే క్లారిటీ ఇచ్చింది టీమ్. అసలే లాస్ట్ ఇయర్ 2020 సంక్రాంతికి అన్ని సినిమాల్నీ వాషవుట్ చేసి అలవైకుంఠపురంలో సినిమాతో సక్సెస్ కొట్టారు బన్నీ.

బన్నీతో పాటు పోటీ పడడానికి మరో సారి రెడీ అయ్యారు సూపర్ స్టార్ . మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సర్కార్ వారి పాట సినిమాని కూడా సంక్రాంతి బరిలోనే దింపుతున్నట్టు అనౌన్స్ చేశారు మహేష్ బాబు అండ్ కో . పోయిన సంవత్సరం సరిలేరునీకెవ్వరు సినిమాతో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టారు మహేష్ బాబు.

నిన్న మొన్నటి వరకూ కామ్ గా ఉన్న అక్కినేని హీరో నాగార్జున కూడా నా నెక్ట్స్ మూవీ సంక్రాంతికే అన్నారు. కళ్యాణ్ కృష్ణ- నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కబోతున్న బంగార్రాజు సినిమాని జూన్ జులై కి స్టార్ట్ చేసి ఫాస్ట్ గా కంప్లీట్ చేసి పండగబరిలోకే దింపుతున్నారు. బంగార్రాజు సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ గా రాబోతోంది.
ఎంత మంది హీరోలు పోటీపడుతున్నా ..పండగ హీరో నేనే అంటున్నారు బాలయ్య. ఈ నటసింహానికి సంక్రాంతి సక్సెస్ హిస్టరీ బాగానే ఉంది. అందుకే ఎంతమందొచ్చినా, ఎన్ని సినిమాలతో వచ్చినా .. సంక్రాంతి సినిమా నాదే అంటున్నారు. మలినేని గోపీచంద్ -బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాని ఎట్టి పరిస్తితుల్లో సంక్రాంతికే ఎయిమ్ చేస్తున్నారు.

అసలే ఇన్ని తెలుగు సినిమాలతో పండగ ప్యాక్ అయిపోయి ఉంటే .. ఇవి సరిపోనట్టు ..తమిళ్ మూవీ పొన్నియున్ సెల్వన్ కూడా పొంగల్ కి మేం కూడా రెడీ అంటోంది. మణిరత్నం డైరెక్షన్ లో ఐశ్వర్యారాయ్, నయనతార, విక్రమ్ , కార్తి, త్రిష.. ఇలా భారీ స్టార్ కాస్ట్ తో హెవీ గా తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీని కూడా త్వరగా ఫినిష్ చేసి సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ చేస్తున్నట్టు చెబుతున్నారు టీమ్. ఈ స్టార్ హీరోల టాప్ మూవీస్ తో సంక్రాంతి సందడి పీక్స్ కి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *